తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. గవర్నర్‌గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

by Rajesh |
తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. గవర్నర్‌గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఆయనకు బీజేపీ హై కమాండ్ కీలక పదవి కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది.

ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్‌ఛార్జి మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారానే ప్రచారం ఊపందుకుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి.. బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.Next Story

Most Viewed