- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case : ‘పెద్దాయన’ గుట్టు తేలనుందా?.. కేటీఆర్, రాధాకిషన్ రావును కలిపి విచారిస్తున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పీఎస్‍లో సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్‍ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ3గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సైతం సిట్ అధికారులు పీఎస్ కు పిలిపించారు. రాధాకిషన్ రావును, కేటీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకిషన్ రావు గతంలో ఆయనను విచారించిన సమయంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చొబెట్టి ఆ పెద్దాయన ఎవరు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఎలాంటి కూపీ లాగబోతోంది? ఇవాళ్టి విచారణతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Read More: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. KTRను ప్రశ్నించనున్న ఆ ఇద్దరు అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసు ‘మనసు-మమత’ సీరియల్: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోంది.. బాంబు పేల్చిన స్టేట్ బీజేపీ చీఫ్
Harish Rao: సప్త సముద్రాల అవతల దాక్కున్నా మిమ్మల్ని వదలం.. పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్






