ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోంది.. బాంబు పేల్చిన స్టేట్ బీజేపీ చీఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-23 06:10:12  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు.

ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోంది.. బాంబు పేల్చిన స్టేట్ బీజేపీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. ఇవాళ నగరంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను శిక్షించే చిత్తశుద్ధి సర్కారుకు లేదని ఆక్షేపించారు. నిజంగా ఆ చిత్తశుద్ధే ఉంటే ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఉండేవారని ఫైర్ అయ్యారు. నాటి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఫోన్లు ట్యాపింగ్ చేయించిన నాయకులు విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందనే అనుమానం ఉందని రామచందర్ రావు బాంబు పేల్చారు.

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. KTR‌ను ప్రశ్నించనున్న ఆ ఇద్దరు అధికారులు

Next Story