Harish Rao: సప్త సముద్రాల అవతల దాక్కున్నా మిమ్మల్ని వదలం.. పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-01-23 06:43:24  IST  )

రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇప్పుడు అతి చేస్తున్న అధికారులకు అప్పుడు ప్రభుత్వం ఏ మాత్రం సహకరించేది ఉండదని హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు.

Harish Rao: సప్త సముద్రాల అవతల దాక్కున్నా మిమ్మల్ని వదలం.. పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) రిటైర్మెంట్‍కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ (SIT) ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు, మీ సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేలా చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులను రిటైర్మెంట్ తర్వాత కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామన్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍ను సిట్ విచారణ నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. రేపు అధికారంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అప్పుడు మీకు ప్రభుత్వం ఏ మాత్రం సహకరించదని మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.

లీకులొద్దు..

కొంత మంది అధికారులు తప్పుడు లీకులు ఇస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లీకువీరులను వదిలిపెట్టేది లేదు. అంతకు అంత అనుభవిస్తారు. జాగ్రత్త ఆలోచించుకోవాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అన్నారు. కుట్రలతో బీఆర్ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది అన్నారు. మేం తప్పు చేయలేదు, ఎవరికి భయపడేది లేదని కేటీఆర్ దైర్యంగా విచారణకు వెళ్లారని చెప్పారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగింది. ఆరోజు ఎందుకు కేసులు పెట్టలేదు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్థుల రాయిస్తే ఏం చేశారు. రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలని అన్ని విషయాలు బయటకు రావాలన్నారు.

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు ‘మనసు-మమత’ సీరియల్: మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

Next Story