దిశ ఎఫెక్ట్....విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలు తొలగింపు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్....విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలు తొలగింపు
X

దిశ, యాచారం : అత్యంత రద్దీగా ఉండే నాగార్జునసాగర్ రహదారి పక్కన విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తాకుతూ ప్రమాదకరంగా మారాయని దిశ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలో నాగార్జునసాగర్ రహదారిపై ఎల్లమ్మ గుడి పక్కన శ్రీ ఎల్లమ్మ తల్లి స్టీల్ ప్యాలెస్ షాపు వద్ద, రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు విద్యుత్​ తీగలకు తాకుతూ అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలంలో ప్రమాదం పొంచి ఉందని శుక్రవారం దిశ, దినపత్రికలో కథనం ప్రచురితమైంది. శనివారం విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ తీగలకు తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించారు. దాంతో వ్యాపారస్తులు, విద్యుత్ వినియోగదారులు, హర్షం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed