బీసీ యువకులెవరూ తొందరపడొద్దు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 08:40:04  IST  )

బీసీ యువకులెవరూ తొందరపడొద్దని.. త్వరలోనే రిజర్వేషన్లను సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

బీసీ యువకులెవరూ తొందరపడొద్దు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ యువకులెవరూ తొందరపడొద్దని.. త్వరలోనే రిజర్వేషన్లను సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ ఆయన అంబర్‌పేట్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతికి పాల్పడిన సాయి ఈశ్వరాచారి (Sai Eshwara Chari) ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే ప్రధాన భూమికతో పని చేస్తోందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీసీ యువకులు ఎవ్వరు తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని అవ్వడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ‌ల మాదిరిగా బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగానే సాదించుకుంటామని అన్నారు. ఈశ్వరాచారి మృతి అత్యంత బాధాకరమని.. భవిష్యత్తులో మరెవరూ ప్రాణ త్యాగాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈశ్వరచారి కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర చట్టసభల్లో ఆమోదించి బీసీ బిల్లులను కేంద్రం పక్కన పెట్టిందని ఆరోపించారు. సీఎం నేతృత్వంలో త్వరలోనే బీసీ రిజర్వేషన్ల కోసం ప్రధానిని కలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Read More... ఆ వీడియో వైరల్ అవ్వడంతో అందరూ తిట్టారు.. సాయి ఈశ్వరచారి భార్య ఆడియో వైరల్

ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్

కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి.. సామా రామ్మోహన్‌‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story