- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వీడియో వైరల్ అవ్వడంతో అందరూ తిట్టారు.. సాయి ఈశ్వరచారి భార్య ఆడియో వైరల్
డిసెంబర్ 4వ తేదీన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం సాయి భార్య కవిత మాట్లాడిన

దిశ, వెబ్ డెస్క్: డిసెంబర్ 4వ తేదీన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం సాయి భార్య కవిత మాట్లాడిన ఓ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. కవిత మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం కారణంగా తాను తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లి ఆర్థికసాయం కోరినట్టు తెలిపింది. మల్లన్న తనకు రూ.20వేలు ఆర్థికసాయం చేశాడని చెప్పింది. అయితే ఆర్థికసాయం చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టడంతో లక్షల మంది చూశారని తెలిపింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తిట్టారని చెప్పింది.
పిల్లలు బయటకు వెళ్లినా, ఎవరు బయటకు వెళ్లినా చీప్‌గా చూస్తున్నారని తమ బంధువులు దూషించారని తెలిపింది. తన భర్త కూడా వెళ్లొద్దు అన్నాడని, కానీ ఆర్థికసాయం చేసేవాళ్లు ఎవరూ లేరని వెళ్లినట్టు చెప్పింది. ఇదిలా ఉంటే సాయి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన వాడు కాగా జగద్గిరి గుట్టలో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సాయి మరణంతో బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడంతోనే సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీడియో
Read More... ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి.. సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు






