- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ నగరంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ (Sai Eshwar) మృతదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ బలహీనవర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేసిన తీరును తెలిపారు. కానీ, ఎవరో రెచ్చగొడితే బీసీలు బలి పశువులు కావొద్దని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాట్లాడి, అమరుడు సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని అన్నారు. 42 శాతం బీసీ కోటా కోసం కేంద్ర స్థాయిలో తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
Read More...
ఆ వీడియో వైరల్ అవ్వడంతో అందరూ తిట్టారు.. సాయి ఈశ్వరచారి భార్య ఆడియో వైరల్
కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి.. సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు






