- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడువులోనే పనులు పూర్తి.. జాప్యానికి తావులేదు: మంత్రి నిమ్మల
పాలకొల్లులో కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు...

దిశ, పాలకొల్లు: పాలకొల్లులో కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, ముస్లిం షాదీఖానా, గౌడ-శెట్టిబలిజ కళ్యాణ మండపం, 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ అభివృద్ధి, టిడ్కో గృహాల మౌలిక వసతులు, వంద పడకల ప్రభుత్వాసుపత్రి సుందరీకరణ, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉద్యానవనం, మంచినీటి చెరువుగట్టు సుందరీకరణ, తూర్పు కాపుల కళ్యాణ మండపం, ఫిషర్‌మెన్ సామాజిక భవనం తదితర పనులపై శాఖలవారీగా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ "ప్రతి పనికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు .ప్రజల డబ్బుతో చేపడుతున్న పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని,పనులు ఆలస్యం కావడానికి ఎలాంటి కారణాలు చెప్పొద్దు. జాప్యం జరిగితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టు సంస్థలపై బాధ్యత ఉంటుంది" అని స్పష్టం చేశారు.
నెమ్మదిగా సాగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, సంబంధిత నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన సాంకేతిక, పరిపాలనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. "పాలకొల్లును అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో, వేగంగా పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి" అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ రాజకుమార్, డిపిఓ వీరబ్రహ్మం , పబ్లిక్ హెల్త్ డి ఈ విజయ్, వివిధ శాఖల ఇంజినీర్లు, పాల్గొన్నారు.






