'లెనిన్' సక్సెస్‌ను ఆ స్టార్ హీరోకు అంకితం చేసిన అఖిల్

by Pulgam srinivas |

'లెనిన్' సినిమా విజయాన్ని రామ్ చరణ్‌కు అంకితం చేస్తున్నానని అక్కినేని అఖిల్ ప్రకటించారు.

లెనిన్ సక్సెస్‌ను ఆ స్టార్ హీరోకు అంకితం చేసిన అఖిల్
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ తాజాగా నటించిన 'లెనిన్' చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఆయన కెరీర్‌లో తొలి పెద్ద విజయంగా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా ఊరటనిచ్చింది. ఈ విజయంతో అఖిల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తనకు రామ్ చరణ్‌తో ఉన్న అనుబంధం గురించి అఖిల్ మరోసారి ప్రస్తావించారు. గతంలోనే 'రంగస్థలం' చిత్రాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా అభివర్ణించిన ఆయన, ఆ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే భారతీయ సినీ పరిశ్రమనే శాసించే స్థాయిలో ఉండేదని కొనియాడారు.

తాజాగా అఖిల్ మాట్లాడుతూ, 'లెనిన్' సినిమా విజయాన్ని రామ్ చరణ్‌కు అంకితం చేస్తున్నాను. 'పెద్ది' సినిమాలో ఆయనలాంటి స్టార్ హీరో ఓ గొప్ప పాత్రను చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటి స్టార్ నటులు పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ ప్రయోగాలు చేస్తే, మాలాంటి యువ హీరోలకు కూడా కొత్త తరహా పాత్రలు చేయాలనే ధైర్యం వస్తుంది. అందుకే ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్‌పై అఖిల్ చూపించిన అభిమానాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Next Story