మంచాల ZPHSలో తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం

by Jakkula.Mamatha |

మంచాల, ఇబ్రహీంపట్నం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చదువు మధ్యలో ఆపేసిన వారు దూరవిద్య ద్వారా చదువును కొనసాగించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ద్వారా సువర్ణ అవకాశం లభిస్తుంది.

మంచాల ZPHSలో తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభం
X

దిశ, మంచాల: మంచాల, ఇబ్రహీంపట్నం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చదువు మధ్యలో ఆపేసిన వారు దూరవిద్య ద్వారా చదువును కొనసాగించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ద్వారా సువర్ణ అవకాశం లభిస్తుంది. మంచాల మండలం జాపాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPHS) ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

సమయం కలిసి వచ్చేలా: కేవలం ఒక సంవత్సరంలోనే కోర్సు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రభుత్వ గుర్తింపు: ఇక్కడ పొందే సర్టిఫికేట్లు ఉన్నత విద్య అభ్యసించడానికి, ఉద్యోగ అవకాశాలకు, పదోన్నతులకు(ప్రమోషన్లు) ప్రభుత్వపరంగా సంపూర్ణ గుర్తింపు కలిగి ఉంటాయి.

కావలసిన పత్రాలు: స్టడీ లేదా టీసీ (ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతి మెమో), ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం (అవసరమైన వారికి), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ఈ నెలాఖరే ఆఖరు తేదీ : దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని హెచ్‌ఎమ్ పేర్కొన్నారు. గతంలో ఈ సెంటర్ ద్వారా పదో తరగతి పూర్తీ చేసిన వారు ఇంటర్‌లో చేరాలని, అలాగే చదువుకోవాలనే ఆసక్తి ఉన్న మిత్రులు, బంధువులు, మహిళా సంఘాల సభ్యులకు ఈ విషయాన్ని తెలపాలని కోరారు.సందేహాలు, ప్రవేశాల వివరాల కోసం 9491655600 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story