- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ దర్శకుడి మూవీలో నటించాలని ఉందంటూ పీవీ సింధు పోస్ట్
ప్రస్తుతం రాజమౌళి, సింధు మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది

దిశ, సినిమా: జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి అందరి ప్రశంసలు పొందుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా సరికొత్త చరిత్ర సృష్టించిన సింధును అభినందిస్తూ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. జపాన్ ఓపెన్ సాధించినందుకు సింధుకు శుభాకాంక్షలు చెబుతూ, ఇదొక ఛాంపియన్ కంబ్యాక్ అని, భారతదేశం మొత్తం నీ గురించి గర్విస్తోందని రాజమౌళి అన్నారు. అయితే రాజమౌళి చేసిన ఈ పోస్ట్‌కు పీవీ సింధు అంతే క్రేజీగా స్పందించారు. రాజమౌళి సార్‌కి ధన్యవాదాలు చెబుతూ, ఆయన దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, ఒకవేళ భవిష్యత్తులో మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే, మీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని సింధు సరదాగా రాసుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి, సింధు మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా.. సింధు టోర్నీలో విజేతగా నిలిచి రెండేళ్లు అవుతోంది.. 2024లో ఆమె సయ్యదు మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేదు. ఆ టోర్నీ తర్వాత ఫైనల్ ఆటడం కూడా మొదటి సారి. మొదటి టోర్నీలోనే పాత ఫామ్‌ను చూపిస్తూ భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. పట్టుదలతో ఆడి దేశానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన సింధుపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






