- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి.. హారర్ థ్రిల్లర్‌లో లక్కీ చాన్స్ కొట్టేసిన డింపుల్ హయాతీ!
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న సరికొత్త హారర్ సినిమాలో డింపుల్ హయతినే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్‌తో అందరినీ మంత్రముగ్దులను చేశారు. ‘రామబాణం’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈచిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ డింపుల్‌కు వరుస చాన్స్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘భోగి’ నటిస్తున్న ఈ భామకు.. తెలుగులో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాక్. మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతున్న సరికొత్త హారర్ సినిమాలో డింపుల్ హయతినే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక స్టార్ హీరో సరసన, అదీ విభిన్నమైన కథలు రాసే దర్శకుడి ప్రాజెక్ట్‌లో డింపుల్‌కు ఈ అవకాశం రావడం విశేషం. అయితే రవితేజ సరసన డింపుల్ హయతి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మూడోసారి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖిలాడి, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాల్లో డింపుల్ తన గ్లామర్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రవితేజ పక్కన పర్ఫెక్ట్ జోడీగా మార్కులు కొట్టేసింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో డింపుల్ హయతికి ఇంత పెద్ద ఆఫర్ రావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు మాత్రం కాస్త భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె రవితేజతో చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో, ఆ ఫ్లాప్ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారు. డింపుల్ గ్లామర్ పరంగా ఎంత ప్లస్ అయినప్పటికీ, లక్ కలిసి రావడం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వివేక్ ఆత్రేయ సినిమాలో డింపుల్ హయతిని హీరోయిన్‌గా పెట్టొద్దని కొందరు నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.






