- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్తూర్బా స్కూల్లో అసౌకర్యాలు.. తల్లిదండ్రుల ఆవేదన
by Kodari Anjali |
జమ్మికుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహంలో వడ్డించే అన్నంలో పురుగులు వస్తున్నాయని, సరిగా ఉడకడం లేదని విద్యార్థినులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, సరైన నీరు లేకపోవడంతో పలువురు విద్యార్థినులు అనారోగ్యానికి గురవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తక్షణమే అధికారులు స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. "పేద పిల్లలను చదివించడానికి కస్తూర్బా స్కూల్లో చేర్పిస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా" అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Next Story






