ఓటీటీని కూడా టేకోవర్ చేసుకున్న సమంత

by Pulgam srinivas |

'మా ఇంటి బంగారం'తో సమంత ఓటీటీలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ఓటీటీని కూడా టేకోవర్ చేసుకున్న సమంత
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి, ఇప్పటివరకు ఏ తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రం సాధించని స్థాయి వసూళ్లను రాబట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఈ సినిమా రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా జియో హాట్‌స్టార్ సంస్థ 'మా ఇంటి బంగారం' ఓటీటీలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఈ సినిమాతో సమంత మరోసారి పలు అరుదైన ఘనతలను అందుకుంటోందని ప్రకటించింది. దీంతో ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ తన సత్తా చాటుతూ విజయవంతంగా దూసుకుపోతోందని చెప్పవచ్చు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వురు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story