- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదుల నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ధర్నా
దేవాదుల నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బస్టాండ్ కూడలి వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు.

దిశ, ఎల్కతుర్తి: దేవాదుల నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బస్టాండ్ కూడలి వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండలం మెట్ట ప్రాంతాలు దేవాదుల నీటి ద్వారానే పంటలు పండుతాయి అని, నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు పక్షపాత వైఖరితో ఘన్పూర్ జనగాం నియోజకవర్గాలకు నీటిని తరలిస్తూ, భీమదేవరపల్లి మండలం, ఎల్కతుర్తి మండలం రైతుల పోట్టగొడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు దేవాదుల నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం మంత్రి ప్రభాకర్ గౌడ్ స్పందించి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునిగడప లావణ్య శేషగిరి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ నగేష్, సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.






