- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి!
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శేరిపల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ ఎర్ర పావని అధ్యక్షతన రైతు అవగాహన సమావేశం నిర్వహించారు.

దిశ,వర్గల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శేరిపల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ ఎర్ర పావని అధ్యక్షతన రైతు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శేషశయన మాట్లాడుతూ.. వర్గల్ మండలంలో సాధారణం కంటే 67 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, భూగర్భ జలాలు తగ్గుతున్నందున రైతులు పూర్తిస్థాయిలో వరి సాగు చేయకుండా జొన్న, పెసలు, మినుములు, కంది, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
ప్రస్తుతం మండలంలో మొక్కజొన్న, స్వీట్‌కార్న్, పత్తి, కూరగాయల పంటలు తేమ ఒత్తిడికి గురవుతున్నందున ఆకులపై యూరియా, పొటాషియం నైట్రేట్, 19:19:19 లేదా 13:0:45 ఎరువులను పిచికారీ చేయాలని సూచించారు. అలాగే భూగర్భ జలాల సంరక్షణ కోసం రైతులు ఫార్మ్‌పాండ్లు నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం బీరయ్య, ఎంపీడీఓ సురేష్, ఏఈఓ సునీత, భాగ్య, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.






