చిన్నారులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే

by Kodari Anjali |

చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

చిన్నారులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
X

దిశ, మల్యాల: చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన నలుగురు చిన్నారులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన కనక శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఉపాధి కొరకు తండ్రి దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో వీరి నలుగురి పిల్లలు అనాధలుగా మారారు. కాగ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఒక లక్ష రూపాయల నగదు సమకూర్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు. భవిష్యత్తు లో అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, దారం ఆది రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, ముత్యం శంకర్, గుర్రం విజయ్, నేరెళ్ల సతీష్ రెడ్డి, గుర్రం శ్రీకాంత్, మ్యాక లక్ష్మణ్, దిండు ప్రవీణ్, పాపారావు, మరాఠీ లక్ష్మీ నారాయణ, మరాఠి సత్తయ్య, నల్గొండ సురేష్, అంజిరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story