- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివ్వెంల పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, చివ్వెంల : సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణ, రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. గ్రామాల రికార్డులు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని పరిశీలించిన ఎస్పీ, ప్రజలకు మరింత పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సైబర్ మోసాలకు గురైన బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పోగొట్టుకున్న నగదు రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. జాతీయ రహదారి-65 చివ్వెంల మండలం మీదుగా వెళ్తున్నందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. మండలంలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత నేరస్థులు, నిందితులను చట్టప్రకారం బైండోవర్ చేయాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్ఐ మహేష్ తో పాటు పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






