కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి.. సామా రామ్మోహన్‌‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-06 05:47:21  IST  )

శ్రీసాయి ఈశ్వర్ (Sri Sai Eshwar) ఆత్మాహుతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా మోహన్ రెడ్డి (Sama Mohan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి.. సామా రామ్మోహన్‌‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసాయి ఈశ్వర్ (Sri Sai Eshwar) ఆత్మాహుతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి (Sama Mohan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన కేటీఆర్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. “బీసీ సోదరులారా తస్మాత్ జాగ్రత్త.. ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి” అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పట్ల నరనరాన తన వ్యతిరేకతను ఇతర రాష్ట్రాలకు వెళ్లి విషం కక్కిన కాలనాగు అంటూ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నదని తెలిసినా.. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్‌పై విషం కక్కుతూ బీసీలను మోసం చేస్తున్న దగాకోరు డ్రామారావు అంటూ ధ్వజమెత్తారు. “గుర్తుపెట్టుకోండి.. బీజేపీ-బీఆర్ఎస్ డ్రామాలు సాగనివ్వం, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు” అని సామా సామా రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story