తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం : మంత్రి మల్లారెడ్డి

by Dishaweb |
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం : మంత్రి మల్లారెడ్డి
X

దిశ,కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా ఖరారు కావడంతో కంటోన్మెంట్ జయనగర్ కాలనీలోని ఆయన కార్యాలయం వద్ద మంగళవారం పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం వేద పండితులు మల్లారెడ్డి దంపతులను ఆశీర్వదించారు.

మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అమలు చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని, తొమ్మిది సంవత్సరాల ఆయన పాలనే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్,బీజేపీ లు ప్రజలకు చేసిందేమి లేదని వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిని కార్యకర్తలు బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఎత్తుకుని సందడి చేశారు.

Next Story

Most Viewed