డ్రగ్ కేసులో ప్రముఖ డీజే సిద్ధార్థ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

by Mahesh |
డ్రగ్ కేసులో ప్రముఖ డీజే సిద్ధార్థ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, అమ్ముతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో డైలీ పబ్బులకు వెళ్లే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో డీజే సిద్ధార్ధ్ పేరుగాంచిన వ్యక్తిని సైదాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పేరుగాంచిన పబ్బులో డీజేగా వ్యవహరిస్తున్న సిద్ధార్థ్ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించగా.. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. మొత్తం 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా సిద్దార్థ్ తో పాటు మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా డీజే సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు సైదాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు.Next Story

Most Viewed