10 కోట్లతో ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

by Kavitha |
10 కోట్లతో ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898AD’. వైజయంతీ మూవీస్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మింస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ జూన్ 27న గ్రాండ్‌గా రీలీజ్ చేయనున్నారు.

సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కి పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుందని అందరు భావిస్తున్నారు.

అయితే కల్కి సినిమాకు 10కోట్లతో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మాత్రం నిర్వహించనున్నారు. కల్కి నిర్మాత అశ్వినీదత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బాగా క్లోజ్ అని తెలిసిందే. ప్రత్యక్షంగా ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు కూడా ఇచ్చాడు నిర్మాత అశ్వినీదత్. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు సీఎం అవ్వడంతో అశ్వినీదత్ అయితే ఆనందంలో ఉన్నారు.

దీంతో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో గ్రాండ్ గా చేయాలని, దానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని గెస్టులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వినీదత్ అడగడం, అమరావతిలో భారీ సినిమా ఈవెంట్ అంటే చంద్రబాబు కూడా ఓకే అంటారని తెలుస్తుంది. అలాగే ఈ ఈవెంట్ కి కల్కి సినిమాలో నటిస్తున్న ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లను కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో కల్కి సినిమా కంటే కూడా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఏపీ సీఎం, స్టార్ హీరోలు అంతా ఒకే స్టేజి మీదకు కల్కి సినిమా కోసం వస్తారా, ఈవెంట్ అమరావతిలో జరుగుతుందా లేదా అనేది చూడాలి మరి.Next Story

Most Viewed