- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.25 వేల కోట్లతో తెలంగాణలో గ్రీన్‌డేటా సెంటర్: కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ విజన్‌ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని ప్రముఖ పారిశ్రామికవేత్త కరణ్ గౌతమ్ అదానీ కొనియాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విజన్‌ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు, APSEZ ఎండీ కరణ్ గౌతమ్ అదానీ కొనియాడారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణలో ఇప్పటికే అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని అన్నారు. గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నామని వెల్లడించారు. సిమెంట్ రంగంలో కూడా అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా అదానీ గ్రూప్ తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీ హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని వెల్లడించారు.
హైదరాబాద్‌లో తయారయ్యే యూఏవీలను సైన్యానికి అందిస్తామని అన్నారు. ఇక్కడ తయారయ్యే యూఏవీలను ప్రపంచ మార్కెట్‌లోనూ విక్రయించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.లాజిస్టిక్స్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోందని కరణ్ అదానీ అన్నారు. రూ. 4 వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు. తెలంగాణలోని జిల్లాలను కలిపే రహదారులను అదానీ గ్రూప్ నిర్మిస్తోందని తెలిపారు. రూ. 2 వేల కోట్లతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు.
Read More...
పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబల్ సమ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు






