- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాకాంబరీ దేవిగా వన దుర్గ భవాని..
by Taduka Kalyani |
ఆషాడ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని శ్రీ ఏడుపాయల వనదుర్గామాత శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

X
దిశ, పాపన్నపేట: ఆషాడ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని శ్రీ ఏడుపాయల వనదుర్గామాత శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరీ దేవి రూపంలో అమ్మవారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు మంజీరా నది పాయలు, చెక్ డ్యామ్ లో పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు.
Next Story






