ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్ సేవలు.. లాగిన్ కాలేక వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్ డౌన్; సర్వర్ లోపంతో ఆగిపోయిన సేవలు, యూజర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సమస్యపై మెటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్ సేవలు.. లాగిన్ కాలేక వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ సేవలు (Facebook Services) ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా భారత దేశంలోని ప్రముఖ నగరాలు అయిన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఫేస్ బుక్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మొబైల్, వెబ్‌లలో లాగిన్ కాలేక వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలను ట్విట్టర్ లో పంచుకుంటూ ఈ అంతరాయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపం, సర్వర్ సమస్యల కారణంగా ఒక్కసారిగా యాప్, వెబ్‌సైట్ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోవడం, మళ్లీ లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే 'ఎర్రర్' అని చూపించడంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. న్యూస్ ఫీడ్ లోడ్ కాకపోవడం, మెసేజ్‌లు వెళ్లకపోవడం వంటి సమస్యలపై నెటిజన్లు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అంతరాయానికి గల ఖచ్చితమైన కారణాలు మరియు సేవలు ఎప్పటికీ పునరుద్ధరించబడతాయనే దానిపై మెటా (Meta) సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story