మధ్యప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం.. UCC బిల్లు ముసాయిదాకు ఆమోదం

by Kema Shiva Kumar |

మధ్యప్రదేశ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు ముసాయిదాకు సీఎం మోహన్ యాదవ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మధ్యప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం.. UCC బిల్లు ముసాయిదాకు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒకే దేశం.. ఒకే చట్టం’ నినాదంతో బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) అధ్యక్షతన జగదీష్‌పూర్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి అధికారికంగా ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ఒకే దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఉండటం సరికాదని అన్నారు. హిందువులకు శ్రీరామచంద్రుడిలా ఒకే వివాహం అనే చట్టం వర్తిస్తున్నప్పుడు.. రహీమ్‌కు కూడా అదే చట్టం వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం మధ్యప్రదేశ్‌లో నివసించే ఏ వ్యక్తైనా ఒకే వివాహం చేసుకోవాలనే చట్టబద్ధమైన నిబంధన తీసుకురానున్నట్లుగా సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు.

Next Story