- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో హరీష్‌రావు
గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రావాలని మంత్రి అడ్లూరి చేసిన చాలెంజ్ ను ఆయన స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రావాలని మంత్రి అడ్లూరి చేసిన చాలెంజ్ ను ఆయన స్వీకరించారు. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కుకు బయల్దేరగా.. అక్కడే హరీష్ రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు రమ్మనడం, పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోవడం దేనికంటూ హరీష్ రావు మంత్రులపై ఫైరయ్యారు. చర్చకు రావాలని ముగ్గురు మంత్రులు పిలిస్తే వెళ్తున్నానని, దానికెందుకు తనను ఆపుతున్నారని పోలీసులతో వాదించారు. కావాలంటే మంత్రులకు ఫోన్ చేసి అడగాలని, వారంతా తమకోసం అమరవీరుల స్థూపం వద్ద ఎదురుచూస్తున్నారన్నారు. తప్పు చేయకపోతే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తామేం కొట్లాటకు పోవట్లేదని, దయచేసి తమను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల పక్షాన, దళితుల పక్షాన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజల గొంతుకగా వెళ్తున్నానన్నారు. తమ వద్ద కొండాసురేఖ లెటర్, హైకోర్టు ఆర్డర్లు, డ్రగ్స్ సప్లయర్లకు, బ్రోకర్లకు టెండర్లు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. కాగా.. ఇందుకు అనుమతి లేకపోవడంతో గన్ పార్కుకు వెళ్లేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లనివ్వబోమన్నారు. వాహనాలను వెళ్లనివ్వకపోతే కాలినడకన వెళ్తామన్నారు. కారు దిగి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు , బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి హరీష్ రావు కిందపడిపోయారు. తమ నేతనే అడ్డుకుంటారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులపై ఫైరయ్యారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతిని బయటపెట్టేందుకు చర్చకు వెళ్తుంటే.. పోలీసులు తమను అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. చర్చకు పిలిచి, పోలీసులతో అడ్డుకోవడం ఎంతవరకూ కరెక్టని ప్రశ్నించారు. చర్చకు పిలిచిన మంత్రులే.. పోలీసులకు చెప్పి రానివ్వాలని చెప్పాలన్నారు. మీడియా సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతినంతా బయటపెడుతామన్నారు. మరోవైపు అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించేందుకు బయల్దేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లను కూడా తెలంగాణ భవన్ వద్దే అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో సవాళ్ల రాజకీయం.. చర్చకు బయల్దేరిన మంత్రులు
‘జోలికొస్తే బిడ్డల్లారా.. తోలుతీస్తాం’.. మాజీ మంత్రి మాస్ వార్నింగ్
మంత్రి అడ్లూరి చాలెంజ్.. గన్‌పార్క్‌కు బయల్దేరిన హరీష్ రావు






