కేటీఆర్, హరీష్ పిల్లలు.. నాతో చర్చకు కేసీఆరే రావాలి: గన్‌పార్క్ వద్ద మంత్రి జూపల్లి సవాల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-02 07:29:24  IST  )

తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు.

కేటీఆర్, హరీష్ పిల్లలు.. నాతో చర్చకు కేసీఆరే రావాలి: గన్‌పార్క్ వద్ద మంత్రి జూపల్లి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ (అమరవీరుల స్తూపం) సాక్షిగా తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నేను నా రాజకీయ జీవితంలో ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. కేటీఆర్, హరీష్ రావు నాకు పిల్లలతో సమానం. వాళ్లతో నాకేం చర్చ? నా సవాల్ వాళ్లకు కాదు.. చర్చకు నేరుగా కేసీఆరే రావాలి" అని జూపల్లి డిమాండ్ చేశారు.

తప్పైతే రాజీనామా చేస్తా..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై తాను సవాలు కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు. "నేను చెప్పిన రాష్ట్ర అప్పుల లెక్కలు గనుక తప్పని నిరూపిస్తే, నేను నా మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు.. తాము చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ నోటితో చెప్పించాలని సవాల్ విసిరారు. మరో వైపు తెలంగాణ భవన్‌లో చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం బీఆర్ఎస్ నేతలు సీటు సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సవాళ్లు స్వీకరించే సత్తా లేదు.. చాలెంజ్ ఎందుకు చేశారు : మంత్రులపై కేటీఆర్ ధ్వజం

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో హరీష్‌రావు

హరీష్ రావు తరలింపులో హై టెన్షన్.. పోలీసుల రూట్ మార్పులు.. వెంటాడుతున్న బీఆర్ఎస్ నేతలు!


Next Story