- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు తరలింపులో హై టెన్షన్.. పోలీసుల రూట్ మార్పులు.. వెంటాడుతున్న బీఆర్ఎస్ నేతలు!
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టే కాకుండా, వారిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర హైడ్రామాకు దారితీస్తోంది. హరీష్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కించగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీస్ వాహనం వెనుక వందలాది వాహనాలతో బీఆర్ఎస్ శ్రేణులు కాన్వాయ్‌లో బయలుదేరారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. "హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే.. అక్కడి వరకు మేము వెంటే వస్తాం" అంటూ గులాబీ శ్రేణులు భీష్మించుకు కూర్చున్నారు.
పదే పదే రూట్ మారుస్తున్న పోలీసులు..
బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వెంబడిస్తుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వాహనంలో ఉన్న సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మార్గాలను (రూట్లను) మారుస్తున్నారు. హరీష్ రావు ఉన్న వాహనాన్ని ఏ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచడం గమనార్హం. దాదాపు గంట కాలంగా హరీష్ రావు బృందం ఉన్న పోలీస్ వాహనాన్ని సిటీలోనే తిప్పుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు రూట్ మార్పుల వ్యూహాన్ని తిప్పికొడుతూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతి అడుగులోనూ ఆ వాహనాన్ని వదలకుండా వెంటాడుతున్నారు. ఈ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో హరీష్‌రావు






