హనీమూన్ మర్డర్ కేసు.. సోనమ్‌ బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోనమ్ కు బెయిల్ మంజూరు చేసిన మేఘాలయ హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమిక సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

హనీమూన్ మర్డర్ కేసు.. సోనమ్‌ బెయిల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోనమ్ కు బెయిల్ మంజూరు చేసిన మేఘాలయ హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమిక సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికే జైలు నుండి విడుదలైనందుకు ఈ దశలో బెయిల్ పై స్టే విధించలేమని స్పష్టం చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాకలు కాగా సుప్రీం అందుకు నిరాకరించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన రాజారఘువంశీ 29 అనే యువకుడికి సోనమ్ అనే యువతితో 2025 మే 11వ తేదీన వివాహం జరిగింది.

పెళ్లైన కొన్నిరోజులకే రాజా రఘువంశీ సోనమ్ మేఘాలయకు హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ కు వెళ్లిన తరవాత సోనమ్ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ముందుగా ప్లాన్ చేసినట్టుగానే భర్తను మేఘాలయలోని వేసావ్ డాంగ్ అనే వాటర్ ఫాల్స్ దగ్గరలోని ఓ లోయలో తోసేసింది. తరవాత తనను కిడ్నాప్ చేసి దుండగులు రఘువంశీని లోయలో తోసేసారని నాటకం ఆడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనమ్, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఏడాది కూడా కాకుండా వారికి బెయిల్ రావడంపై ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Next Story