- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూలపేట హైస్కూల్లో నో అడ్మిషన్ బోర్డు.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే..!
2004-2005 పదో తరగతి, ఇంటర్‌లో కాకినాడ జిల్లాలోనే పిఠాపురం నియోజకవర్గం మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో కాకినాడ జిల్లా(Kakinada District)లోనే పిఠాపురం నియోజకవర్గం(Pithapuram constituency) మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అలాగే పాఠశాలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు లేవంటూ నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. మూలపేట జెడ్పీ హైస్కూలు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
అందుకే సాధ్యమయ్యాయి....
టీచర్ల బోధన విధానాలు, బోధనేతర సిబ్బంది సహకారంతో అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి పిఠాపురం పర్యటన సందర్భంగా మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శిస్తానని ఆయన మాటిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మూలపాడు జెడ్పీ హైస్కూల్ సాధించిన ఫలితాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






