- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల్లో మహిళ సంఘం నూతన భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ
నాగర్ కర్నూల్ జిల్లా పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నూతన గ్రామ మహిళ సంఘం భవనాలకు భూమి పూజ చేశారు.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి, ఈదులబావి గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఒక్కొక్క గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించే నూతన గ్రామ మహిళా సంఘం భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనాలు రూ .30 లక్షల నిధులతో నిర్మించాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టామని, వీటిని నిర్మాణాలు యుద్ధ ప్రతిపాదికనగా కొనసాగుతున్నాయన్నారు. ఈ భవనాలు మహిళా సమావేశాలకు, ఆర్థిక లావాదేవీలకు, నైపుణ అభివృద్ధికి, స్వయం ఉపాధి శిక్షణకు, సంక్షేమ పథకాలు శాశ్వత వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. ఈ భవనాల ద్వారా కుట్టు మిషన్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఒకే చోట నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. మహిళా ఆర్థిక లావాదేవీలు బ్యాంకు లింకేజీలు ఇతర రుణాలపై చర్చించడానికి వేదికలుగా మారిన ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రహీం, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో లింగయ్య, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






