- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్వేల్ సమావేశంలో రగడ.. కార్యకర్తలపై మంత్రి సవిత సీరియస్
by Vemula.Srinu Prasad |
కడప జిల్లా బద్వేల్(Badvel)లో టీడీపీ(Tdp) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సవిత(Minister Savitha)తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలో టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) బద్వేల్(Badvel)లో టీడీపీ(Tdp) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సవిత(Minister Savitha)తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలో టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. ఇంచార్జి నియామకంపై ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి సవిత సమక్షంలో పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో మంత్రి సవిత అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమ శిక్షణ పాటించాలని సూచించారు. ఇంచార్జి నియమాకం సీఎం చంద్రబాబు నాయుడిదే తుది నిర్ణయమని కార్యకర్తలకు మంత్రి సవిత స్పష్టం చేశారు. దీంతో వివాదం సర్దుమనిగింది.
Next Story






