డీప్ ఫేక్ ఫొటోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా

by Chukka Sudharani |

బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

డీప్ ఫేక్ ఫొటోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్‌కు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించింది. వెంటనే ఈ కంటెంట్‌ను ఇంటర్నెట్ నుండి పూర్తిగా తొలగించేలా అత్యవసర ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రీతి జింతా కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మాధవ్ జామదార్.. కంటెంట్‌ను వెబ్‌సైట్ల నుండి తొలగించడానికి ఒక సులువైన విధానాన్ని రూపొందించాలని ఇరు పక్షాలకు సూచించింది. కాగా దీనిపై తదుపరి విచారణ జూలై 6న జరగనుంది. ఈ మేరకు ప్రీజి జింతా తరఫు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ వాదనలు వినిపిస్తూ.. రోజురోజుకూ ఈ డీప్‌ఫేక్స్ పెరుగుతోందని, అందువల్ల తక్షణమే సదరు లింకులను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మరోవైపు గూగుల్, మెటా సంస్థల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ‘వివాదాస్పద లింకులను తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే సాధారణ కంటెంట్‌కు ఇబ్బంది లేకుండా, కేవలం అభ్యంతరకర లింకులను మాత్రమే తొలగించేలా ఒక ప్రాక్టికల్ ప్రోటోకాల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

Next Story