అశ్వాపురంలో పట్టపగలు చోరీ.. రూ.50 వేల నగదు అపహరణ

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అశ్వాపురంలో పట్టపగలు చోరీ.. రూ.50 వేల నగదు అపహరణ
X

దిశ, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉషోదయ పాఠశాల వెనుక వీధిలో నివాసం ఉంటున్న తేజవత్ సోమ్ల నాయక్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సమాచారం ప్రకారం.. సోమ్ల నాయక్ దంపతులు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా బీరువా పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు స్థానికులకు సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకున్న వారు ఇంటిని పరిశీలించారు. బీరువాలో దాచిన రూ.50 వేల నగదు కనిపించకపోవడంతో దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. పట్టపగలు చోరీ జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story