ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల పరిరక్షణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల పరిరక్షణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పూర్తి స్థాయి పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా రాష్ట్ర డీజీపీతోపాటు తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు, ప్రతిపాదనలను (Proposals) త్వరగా సిద్ధం చేసి ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో పోలీస్ కమిషనరేట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రి కూడా ఈ జాబితాలో చేరితే ఏపీలో మొత్తం కమిషనరేట్ల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాగనుంది.

Next Story