గుజరాత్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. 8మంది జైషే మద్దతుదారుల అరెస్ట్

by Ajay Maddhiboyina |

గుజరాత్‌లో ఉగ్రకుట్రను యాంటి టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ భ‌గ్నం చేసింది. గుజ‌రాత్ లో క్రియాశీల ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో జైష్ ఏ మొహ‌మ్మ‌ద్‌కు చెందిన 8 మందిని అనుమానితులను అరెస్ట్ చేశారు.

గుజరాత్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. 8మంది జైషే మద్దతుదారుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో ఉగ్రకుట్రను యాంటి టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ భ‌గ్నం చేసింది. గుజ‌రాత్ లో క్రియాశీల ఉగ్ర‌వాద నెట్ వ‌ర్క్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో జైష్ ఏ మొహ‌మ్మ‌ద్‌కు చెందిన 8 మందిని అనుమానితులను అరెస్ట్ చేశారు. గత ఆరు నెలలుగా వీళ్లు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తరఫున చురుకుగా పనిచేస్తూ, రాష్ట్రంలో ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్యక్తులు ఉగ్రకుట్రను అమలు చేసే ముందే అరెస్టులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. నిందితుల్లో ఏడుగురిని గుజరాత్ లోని పలు జిల్లాల నుండి అదుపులోకి తీసుకోగా ఒకరిని మధ్యప్రదేశ్ లో అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసినవారిలో అహ్మద్ అబ్దుల్లా గజివాలా అలియాస్ అబు ఉబైదా (19), ఇబ్రహీం మహ్మద్ హుసేన్ ఘాఘా అలియాస్ అబు హంజా (30), పాలన్‌పూర్‌లోని భాగల్ నివాసి ముదస్సిర్ అబ్దుల్లా ఘజివాలా అలియాస్ అబు ఆయ (22), మహ్మద్ అమ్మర్ ఘాఘా అలియాస్ ఇబ్న్ అమ్మర్ అలియాస్ జకారియా పాలన్‌పురి (21), ముఫ్తీ ఫౌజన్ ఇస్మాయిల్ దౌవా అలియాస్ ముఫ్తీ సాహబ్ (40), మహ్మద్ అమీన్ షేరా అలియాస్ అమీన్ పాలన్‌పురి (21), మహ్మద్ అబ్దుల్ రహ్మాన్ సావ్ది అలియాస్ మహ్మద్ పాలన్‌పురి అలియాస్ అబు యూనిసా (22), అబు జుందాల్ అలియాస్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (18) ఉన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Next Story