- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
160 KM మైలేజ్ తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..ధర, ఫీచర్స్ ఇవే
Revolt RVX పేరుతో 160 KM మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలు వస్తూనే ఉన్నాయి. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా రకరకాల బైక్స్ తీసుకువస్తున్నారు. లేటెస్ట్ గా రివోల్ట్ RVX ( Revolt RVX ) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ అయింది. ఎక్స్ షోరూం ప్రకారం ఈ బైక్ ధర 1.30 లక్షలుగా ఉంది. పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ తర్వాత ఈ బైకు 1.24 లక్షలకే రానుంది. యూత్ ను ఆకట్టుకునేలా ఈ బైక్ డిజైన్ చేయడంతో... మార్కెట్లో భారీగానే డిమాండ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రివోల్ట్ RVX లో 3.24 kwh రిమూవబుల్ బ్యాటరీ కూడా అందిస్తున్నారు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే... 160 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. అంటే ఈ బైక్ లాంగ్ డ్రైవ్ కు బాగా పనిచేస్తుంది. ఫాస్ట్ చార్జర్ తో కేవలం 80 నిమిషాల్లోనే.. దాదాపు 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. 3.9 సెకండ్స్ లో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఏకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్ ఆప్షన్స్ ఈ బైక్స్ లో ఉన్నాయి. బ్లూటూత్ తో స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 3.5 అంగుళాల రేటింగ్ తో కూడిన డిస్ ప్లే కూడా అందిస్తున్నారు.






