- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
పోలీస్ శాఖలో ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలో ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు అయిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
మొత్తం 10 విభాగాలలో కలిసి 5000 పోస్టులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3697 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుల్ కేటగిరిలో 1052 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్సై సివిల్ పోస్టులు 148 కూడా ఉండటం గమనార్హం. SI ఆర్మ్డ్ రిజర్వు 14, రిజర్వ్ SI 12, సబ్ ఇన్ స్పెక్టర్ 3, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ 23, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ సీపీఎల్ 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ విభాగంలో 20, మెకానిక్ పీటీఓలో భాగంగా ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు.






