- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడిసిన్ కోనుగోలు, పంపిణీ వ్యవస్థపై సర్కార్ కీలక నిర్ణయం
మందుల కోనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: వర్షా కాలం వచ్చిన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అలర్ట్ అయ్యారు. ఏపీలో హెల్త్ డిపార్ట్ మెంట్ పై స్ఫెషల్ ఫోకస్ పెట్టారు. వైద్యం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సచివాలయంలో 4 గంటల పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మందుల కోనుగోలు, పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రోగుల అవసరాలకు తగ్గట్లు తీసుకోవాల్సిన చర్యలపై రెండు వారాల్లోగా నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు. పరికరాలు, మిషన్ల కొనుగోలు, సరఫరాకు నిర్ధిష్ట క్యాలెండర్‌ను రూపొందించాలని తెలిపారు. ఆసుపత్రుల భవన నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని దిశా నిర్దేశం చేశారు.






