రావణ్‌కు మూడో కేసులో బెయిల్ మంజూరు, కానీ మ‌ళ్లీ అరెస్ట్ !

by velandi.Saikiran |

రావణ్ కేసులో మూడోసారి ఏపీ పోలీసులకు షాక్ త‌గిలింది.

రావణ్‌కు మూడో కేసులో బెయిల్ మంజూరు, కానీ మ‌ళ్లీ అరెస్ట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: రావణ్ కేసులో మూడోసారి ఏపీ పోలీసులకు షాక్ త‌గిలింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు మూడో కేసులో బెయిల్ మంజూరు అయింది. రావణ్ రిమాండ్ రిజెక్ట్ చేసిన న్యాయమూర్తి, బెయిల్ ఇచ్చారు. మచిలీపట్నం మెజిస్ట్రేట్ ఎదుట ప్రశ్న రావణ్‌ని ఇనగుదురు పోలీసులు హాజరుపరిచారు. ఈ త‌రుణంలోనే వ్యక్తిగత పూచీకత్తుతో రావణ్‌కు బెయిల్ మంజూరు అయింది. దీంతో వరుసగా మూడోసారి రావణ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేశాయి కోర్టులు.

రావణ్ మ‌రోసారి అరెస్ట్ !

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశ్న రావణ్ పై కేసుల పరంపర కొనసాగుతున్నాయి. మచిలీపట్నం మెజిస్ట్రేట్ లో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే మ‌చిలీపట్నం నుంచి రావణ్‌ను పాయకరావుపేటకు తరలించారు పోలీసులు.

Next Story