వైభవ్ స్పెషల్ పోస్ట్.. రెండో టీ20లో ఆడుతున్నాడా?

by velandi.Saikiran |

వైభ‌వ్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

వైభవ్ స్పెషల్ పోస్ట్.. రెండో టీ20లో ఆడుతున్నాడా?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య ఇవాళ రెండో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. న్యూ ఛాప్టర్ అంటూ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఆడిన ఇన్నింగ్స్ ఫోటోలను తన స్టోరీలో షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ... రెండో టీ20 మ్యాచ్ లో ఆడతాడని అందరూ అనుకుంటున్నారు.

ఒకవేళ వైభవ్ ఆడాలనుకుంటే ఎలా?

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ నేపథ్యంలో ఇవాళ రెండవ మ్యాచ్ జరగనుంది. ఇందులో వైభవ్ ఆడతాడని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వైభవ్ ఆడాలంటే ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం తిలక్ వర్మ, సంజు శాంసన్ ఇద్దరిలో ఒకరిపై వేటు పడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరిని పక్కకు పెడతారని అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే మరి కొంత మంది వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంటులో కూడా ఆడడం కష్టమేనని అంటున్నారు. వరల్డ్ కప్ హీరోలతోనే మామ అనిపించే దిశగా గంభీర్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

Next Story