- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ ను ఆడించకపోవడంపై విమర్శలు..బీసీసీఐ క్లారిటీ
వైభవ్ ను ఆడించకపోవడంపై విమర్శలు వస్తున్న తరుణంలో బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ అరంగేట్ర మ్యాచ్ ఆడడంపై గందరగోర పరిస్థితి ఉంది. ఐర్లాండ్త తో జరిగిన సిరీస్ సందర్భంగానే వైభవ్, తొలి మ్యాచ్ ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ అతడికి అవకాశం రాలేదు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ సందర్భంగా ఎలాగైనా వైభవ్ ను ఆడించాలని డిమాండ్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. సంజు స్థానంలో వైభవ్ కు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు. అయితే వైభవ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు.
ఈ విషయంలో కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ తన టాలెంట్ ను ఐపీఎల్ లో నిరూపించుకున్నాడని గుర్తు చేశారు. తన అరంగేట్రంపై తుది నిర్ణయం కోచ్, కెప్టెన్ దేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. టైం వస్తే, తప్పకుండా వైభవ్ ను ఆడిస్తారని వెల్లడించారు. ఇది తెలియకుండా చాలా మంది గంభీర్, శ్రేయస్ అయ్యర్ పై అనవసరంగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని.. అప్పటి వరకు అభిమానులు కూడా వేచి చూడాల్సిందేనని తేల్చి చెప్పారు.






