- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లబండ వద్ద ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. కంభంలో పెళ్లికి వెళుతున్న ఆటోను రోడ్డు పక్కన నిలిపివేయగా వేగంగా వచ్చిన లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లబండ వద్ద ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. కంభంలో పెళ్లికి వెళుతున్న ఆటోను రోడ్డు పక్కన నిలిపివేయగా వేగంగా వచ్చిన లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో అంకాలు (22), నగేష్ (18), అలకనంద (18)తో పాటు మరో నాలుగేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జైంది. ఆటోను ఢీ కొట్టిన తరవాత రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి సైతం లారీ దూసుకెళ్లింది. ప్రమాదం స్థలంలో సన్నివేశాలు హృదయాలను కలచివేసేలా ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడిపాడా లేదంటే నిద్రమత్తులో నడిపాడా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.






