అంగన్‌వాడీల బలోపేతానికి సహకరించండి : కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి

by Muthe.Rajitha |

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో న్యూఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

అంగన్‌వాడీల బలోపేతానికి సహకరించండి : కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో న్యూఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మహిళా, శిశు సంక్షేమ పథకాలపై చర్చించి పలు వినతిపత్రాలు సమర్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న అల్పాహారం, పాలు కార్యక్రమం విజయవంతమైందని, దీనికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న 20 శాతం వాటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు. టీనేజ్ బాలికల్లో రక్తహీనతను తగ్గించేందుకు ప్రత్యేక పోషకాహార పథకం కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీతక్క కోరారు. తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం తోడ్పాటు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Next Story