మాగనూర్ మండలంలో జోరుగా పేకాట..!

by Kodari Anjali |

మందిపాల్, ఉజ్జలి, నేడుగం, పెగడబండ తదితర గ్రామాల్లో పేకాట స్థావరాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మాగనూర్ మండలంలో జోరుగా పేకాట..!
X

దిశ, మాగనూర్: మండలంలో మందిపాల్, ఉజ్జలి, నేడుగం, పెగడబండ తదితర గ్రామాల్లో పేకాట స్థావరాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజూ లక్షల రూపాయల మేర జూదం జరుగుతున్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు. మాగనూరు మండలంలోని పలు గ్రామాల్లో బహిరంగంగానే పేకాట నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజూ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేకాట కారణంగా యువతతో పాటు పలువురు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, అక్రమ జూదాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story