- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : సీఎస్ కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సంబంధించిన పలు కీలక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు విద్యా సంస్థలకు సంబంధించిన పలు కీలక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై రూపొందించిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది బదిలీలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలు, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ తదితర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) వర్తింపజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో జిఓఎంఎస్. నెం190 ని తక్షణమే, సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
డీఎస్సీ 2003 ద్వారా ఎంపికైన అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ఉపాధ్యాయులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో విలీనం చేసి, వారి వేతనాలను 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ఏకరీతి పని వేళలను ఒకే విధమైన టైమ్‌టేబుల్‌ను అమలు చేయాలని అని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై సీఎస్ సంజయ్ జాజు సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.






