ఆళ్లపల్లిలో దంచికొట్టిన వాన.. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు ఆళ్లపల్లి మండలం తడిసిముద్దైంది.

ఆళ్లపల్లిలో దంచికొట్టిన వాన.. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం
X

దిశ, ఆళ్లపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు ఆళ్లపల్లి మండలం తడిసిముద్దైంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆళ్లపల్లిలో 16.5 మిల్లీమీటర్లవర్షపాతం నమోదైంది. జిల్లాలో నమోదైన వర్షపాతంలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. వర్షంతో మండలంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story