కడప స్టీల్ ప్లాంట్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా జమ్మలమడుగులో సీఎ చంద్రబాబు నాయుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ తొలి దశ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభంపై మాజీ సీఎం జగన్ సెటైర్లు వేశారు..

కడప స్టీల్ ప్లాంట్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా జమ్మలమడుగు(Jammalamadugu)లో సీఎ చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) జిందాల్ స్టీల్ ప్లాంట్(Jindal Steel Plant) నిర్మాణ తొలి దశ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రారంభంపై మాజీ సీఎం జగన్(Former Cm Jagan) సెటైర్లు వేశారు. స్టీల్ ప్లాంట్‌ను పున:ప్రారంభం శుపరిణామమని ఎద్దేవా చేశారు. ఇది రాయలసీమకు కీలక మైలు రాయి అని వ్యాఖ్యానించారు. తమ హయాంలోనే JSWని ఎంపిక చేశామని చెప్పారు. అన్ని అనుమతులు తమ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆగిపోయిందని గుర్తు చేశారు. తాజాగా పున: ప్రారంభించడం శుభపరిణామని చెప్పారు. JSW, సజ్జన్ జిందాల్‌కు తాను అభినందనలు చెబుతున్నానని జగన్ తెలిపారు. ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story